Homeజిల్లాలుఅనంతపురంగర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం..

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం..

- Advertisement -

ఆర్డీఓ కేశవ నాయుడు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ నిబంధనలో అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలోని తన ఛాంబర్ లో డివిజనల్ స్థాయి అప్రా ప్రీయేట్ అథారిటీ కమిటీ సమీక్ష సమావేశంను తన అధ్యక్షతన నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ… లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. చట్ట విరుద్ధంగా స్కానింగ్ చేసినట్లు నిరూపణ అయితే అనుమతులు రద్దుచేసి జరిమానా తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
పిసి & పి ఎన్ డి టి చట్టాన్ని పకడ్బందీగా సలహా కమిటీ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుదల శిశు లింగ నిర్ధారణ లింగ వివక్షతను అరికట్టే ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ మరియు ఇతర శాఖల సమన్వయంతో లింగ నిర్ధారణ పరీక్షలను డివిజన్లో పూర్తిగా నిరోదించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రధాన జనసంచార ప్రదేశాలలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన మేరకు ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని తెలిపారు. డివిజన్ స్థాయిలో కళాశాలల విద్యార్థినిలకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలవివాహాల నిర్మూలనకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. యుక్త వయస్సు గర్భాధారణలను నివారించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ
కృషి చేయాలని కోరారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా లేదా అట్టివారిని ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. మరి ముఖ్యంగా వైద్యుల సూచనలు సలహాల (ప్రిస్క్రిప్షన్ )మేరకు మాత్రమే మెడికల్ షాపులలో మందులు అమ్మాలని, అందుకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ కు బదులుగా నిర్దిష్ట ఔషధాలు కాకుండా మందుల షాపుల యజమాన్యాలు మందులను విక్రయించడం పట్ల ప్రత్యేక నిఘా ఉంచాలని కమిటీ సభ్యులను కోరారు.
ఈ సమావేశంలో ఆర్డీవో తో పాటు 4వ పోలీస్ స్టేషన్ సి.ఐ. జగదీష్, డెమో నాగరాజు, పర్యవేక్షణ అధికారి ఆశారాణి, డా. రవి కుమార్, డా.శ్రీధర్ డా. సౌజన్య ,ఆర్డిటి ప్రతినిధి డా. దుర్గేష్, లీగల్ అడ్వైజర్ సంధ్యారాణి, రెడ్స్ భానుజా, హెడ్స్ రమేష్, సిబ్బంది వెంకటేష్, కిరణ్ కుమార్, శ్రీకాంత్
తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు