వన్డే సిరీస్ ఆసీస్ కైవసం
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు తేలిపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. శుక్రవారం హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమఇండియాపై ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా… ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి గెలిచింది. ఆసీస్ బ్యాటర్ జార్జియా వోల్ (101`82 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో తన జట్టు విజ యంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ ఫోయిబ్ లిట్చ్‌ఫీల్డ్ (80: 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడింది. బెత్ మూనీ (31), అన్నాబెల్ సదర్లాండ్ (10), ఆష్లే గార్డెనర్ (15) పరుగులు చేశారు. భారత బౌలర్లలో గౌతమ్ 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జార్జియా వోల్ నిలిచింది. తొలి వన్డే మ్యాచ్‌లోనూ ఆసీస్ విజయం సాధించిన సంగతి విదితమే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే ఆసీస్ పరమైంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే మార్చి 1న హోబర్ట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓ మోస్తరు స్కోరునే చేయగలిగింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (52), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (54) అర్ధ సెంచరీలు సాధించారు. స్మృతి మంధాన (31), రిచా ఘోష్ (22), కాష్వీ గౌతమ్ (25), క్రాంతి గౌడ్ (19). జెమీమా రోడ్రిగ్స్ (15), దీప్తి శర్మ (1) అమన్ జోత్ కౌర్ (13) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డెనర్ 2, అన్నాబెల్ సదర్లాండ్ 2, అలానా కింగ్ 2.. స్కట్, నికోలా కారీ చెరో వికెట్ పడగొట్టారు.
రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
- Advertisement -


