Homeఆంధ్రప్రదేశ్రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ 

రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ 

- Advertisement -
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో  దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును పునఃప్రారంభించింది. 
ఈ కేసులో నిందితులు సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌, భరత్‌కుమార్‌ యాదవ్‌ సోదరుడు మహేంద్ర యాదవ్‌ను విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. తాజాగా కడప జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు వారిని విచారించనున్నారు. మహేంద్ర యాదవ్‌ విచారణకు హాజరు కాగా.. కిరణ్‌ యాదవ్‌ సాయంత్రం 4 గంటలకు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇక మ‌రోవైపు సుప్రీం కోర్టు సూచనల మేరకు కిరణ్‌ యాదవ్‌- అర్జున్‌రెడ్డి మధ్య జరిగిన కాల్‌ డేటాపై సీబీఐ విచారణ చేయనుంది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1.42 గంటలకే అర్జున్‌ రెడ్డికి కిరణ్‌ యాదవ్‌ వాట్సాప్ కాల్‌ చేశాడు. వీరిద్దరి ఫోన్‌ సంభాషణపై సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో వీరిద్దర్నీ సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు