విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో వసుంధర ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వసుంధర మాట్లాడుతూ టైలర్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. నేడు ఈ టైలర్ వృత్తి ముఖ్యంగా మహిళలకు జీవనాధారమును కల్పిస్తూ మంచి జీవితాన్ని ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఎంతోమంది టైలర్ వృత్తిని తో మంచి జీవితాన్ని గడుపుతూ తమ కుటుంబ సభ్యులను ఉన్నత స్థాయి చదువులకు కూడా చదివించడం జరుగుతోందని తెలిపారు. ఏదైనా ఒక వృత్తిని శ్రద్ధతో ఏకాగ్రతతో నేర్చుకున్నప్పుడే దానికి తగ్గ ఫలితంతో పాటు జీవితములో మంచి ఉపాధి కలుగుతుందని తెలిపారు.
గొట్లూరులో ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


