Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతల స్వీకరణ

ధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతల స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉన్న హేమంత్ కుమార్ హైకోర్టు ఉత్తర్వులు మేరకు ప్రభుత్వం మంగళగిరికి బదిలీ చేశారు. తదుపరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసింహ పెనుకొండ డిఎస్పి తో పాటు అదనంగా ధర్మవరం డిఎస్పీగా బాధ్యతలు కొనసాగిస్తారని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వన్ టౌన్, టూ టౌన్, రూరల్ తదితర పిఎస్ఎల్ నుండి సీఐలు, ఎస్ఐలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ తన వంతుగా ధర్మవరం డివిజన్ శాంతి భద్రతల కొరకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా గట్టి భద్రత ఇస్తూ, పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తేవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన చట్టాలను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అపరిచిత వ్యక్తుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు వస్తే ఆయా పిఎస్యులకు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు