సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో కూటమి నాయకుల ఆదిపత్య కొనసాగుతూ ఉందని ఈ ఏడాదికి కూడా నేటికీ ఉపాధి హామీ పనులు ప్రారంభించకపోవడంతో పనులు లేక ఉపాధి కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అన్ని మండలాల్లో ఉపాధి పనులు ప్రారంభించి నెల రోజులు అవుతున్నా ఇక్కడ మాత్రంనేటికీపనులుప్రారంభించకపోవడం దారుణమన్నారు, ఈ పథకంలో భాగంగా మండలంలో సుమారు పదివేలకు పైగా జాబ్ కార్డులు ఉండడంతో పాటు తో పాటు దాదాపు 25 వేల మంది ఉపాధి కూలీలు ఉండడమే గాక వారిలో సుమారు 70 శాతం మంది ఈ పనుల మీదే ఆధారపడ్డారని పేర్కొన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దాదాపు రెండేళ్ల అవుతున్న ఈ మండలంలో నాయకుల వర్గ విభేదాలతో ఉపాధి హామీ పథకం లో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్ లను చాలా పంచాయతీల్లో నేటికీ నియమించకపోవడంతో కూలీలకు పని కల్పించేవారు లేక ఈ పనులకు
గ్రహణం పట్టినట్లు అయిందని ఆరోపించారు, ఈ పథకంలో భాగంగా కూలీలకు ఏడాదికి కనీసం వంద రోజులు పని దినాలు కల్పించాల్సి ఉండగా ఈ మండలంలో ఇప్పటివరకు గత రెండేళ్ల నుంచి కేవలం 60 రోజులు మాత్రమే పని కల్పించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందన్నారు, అదేవిధంగా ఈ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేయాలనుకుంటున్న వందల మంది రైతన్నలు కూడా నాయకుల వర్గ విభేదాలతో తమ పండ్ల తోటలు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోతుండడంతో వారి ఆవేదనకు కూడా అంతులేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే మండలంలో కూటమి నాయకుల ఆదిపత్య పోరు ఎంత తారాస్థాయికి చేరిందో తెలుస్తోందన్నారు, ముఖ్యంగా టిడిపి, బిజెపి నాయకుల మధ్య పోరు ఓవైపు ఉండగా, మరోవైపు టిడిపి లోనే మూడు వర్గాలతో
ఆ పార్టీ నాయకుల ఆధిపత్యం మరోవైపు కొనసాగుతు చాలా పంచాయతీల్లో నేటికీ ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం జరగకపోవడంతో ఉపాధి హామీ పథకం పనులకు గత రెండేళ్ల నుంచి తరచూ ఆటంకం ఏర్పడుతూ సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో ఓవైపు కూలీలు నిరాశ చెందుతుండగా మరోవైపు పండ్లతోటలు సాగు చేసుకోలేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారని విచారం వ్యక్తం చేశారు, అధికార పార్టీ నాయకుల వర్గ విభేదాలతో అధికారుల సైతం ఏమీ చేయలేక మౌనం పాటిస్తుండడంతో మండలంలో అభివృద్ధి పనులు సవ్యంగా కొనసాగుతాయో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా కూటమి నాయకులు వర్గాలకు స్వస్తి చెప్పి ఈ ఉపాధి హామీ పథకం పనులు సవ్యంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో త్వరలోనే ఉపాధి హామీ కూలీలతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించండి..
- Advertisement -
RELATED ARTICLES


