Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచెత్త సేకరణకు వాహనాన్ని విరాళం

చెత్త సేకరణకు వాహనాన్ని విరాళం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తనవంతుగా చెత్త సేకరణకు అవసరమైన ఆటో వాహనాన్ని విరాళంగా వారు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా ఈ వాహనం చెత్తను డోర్ టు డోర్ వెళ్లి తీసుకొని రకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో ట్రై సైకిల్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ వాహనాన్ని ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. తన సొంత కచ్చుతో ఈ చెత్త సేకరణ కొరకు ప్రత్యేక ఆటను ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి పంచాయతీ కార్యదర్శి శివ భాస్కర్, సచివాలయ సిబ్బంది చిరకం మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఈ ఆటో వల్ల రేగాటిపల్లిలో శుభ్రత మరింత మెరుగుపడుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు