ఏఐఎస్బి, ఏఐఎస్ఓ, ఏఐఎస్యూ విద్యార్థి సంఘాలు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలోని యశోద స్కూలు ఎదురు సందులోఅనుమతుల లేని రఘు స్కూల్ పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్బి, ఏఐఎస్ఓ, ఏఐఎస్యూ విద్యార్థి సంఘాలు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ సదరు పాఠశాలకు విద్యాశాఖ/ప్రభుత్వం నుండి గానీ, సైనిక్ స్కూల్ సొసైటీ నుండి గానీ ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని, తప్పుడు ప్రకటనలు చేస్తూ, అమాయక తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు: గుర్తింపు లేని ఇలాంటి విద్యాసంస్థల్లో చేరడం వల్ల విద్యార్థులు విద్యాపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు..కావున వెంటనే ఈ పాఠశాల గుర్తింపు , అనుమతులపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మోసపోకుండా ప్రజలను చైతన్యపరచాలని వారి కోరారు. కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేపడతామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య ఏ ఐ ఎస్ ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ ఏ ఐ ఎస్ యూ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని రఘు ఏడ్జ్ స్కూల్ సోషల్ మీడియా ప్రచారాలపై విచారణ జరపాలి
- Advertisement -
RELATED ARTICLES


