Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈ ఈ ఎల్ ఒలింపియాడ్ లో విజయకేతనం ఎగురవేసిన శ్రీ శ్రీనివాస స్కూల్

ఈ ఈ ఎల్ ఒలింపియాడ్ లో విజయకేతనం ఎగురవేసిన శ్రీ శ్రీనివాస స్కూల్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఈ ఎల్ ఓలింపు యాడ్ 2025-26 సంవత్సరములో పట్టణములోని శాంతినగర్ లో గల శ్రీ శ్రీనివాస స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని హెడ్మాస్టర్ వెంకట పెరుమాళ్, డైరెక్టర్ యశ్వంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 1వ తేదీ అనంతపురంలోని ఏ బి సి స్కూల్లో నిర్వహించిన ఈ ఈ ఎల్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ఒకటవ తరగతి అబ్బాయి ఈక్షిత్ మొదటి బహుమతిని, వైష్ణవి రెండవ తరగతి ద్వితీయ బహుమతిని, దీషిత మూడవ తరగతి మొదటి బహుమతిని, ఆఫ్రాఫ్, కార్తికేయ నాలుగవ తరగతి ద్వితీయ స్థానమును, ఐదవ తరగతిలో హేమిక ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టారు డైరెక్టర్లతోపాటు కరెస్పాండెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు