విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలోని ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులతో కొత్త శోభను సంతరించుకుంది. ఆర్టీసీ బస్టాండ్ డిపో మేనేజర్ సత్యనారాయణ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణమును, వివిధ గదులను నూతన పెయింటింగ్ తో నూతనంగా అలంకరింపజేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ఐదు లక్షల నిధులు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులను ఆకర్షించే విధంగా, మరిన్ని సేవలను అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పూల మొక్కలు, త్రాగునీరు, ఆర్వో వాటర్ క్యాన్స్, టాయిలెట్ మరమ్మత్తులు చేసి పరిశుభ్రంగా ఉంచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఆవరణంలో ప్రయాణికులు వేచి ఉండుటకు గతంలో ఉన్న కుర్చీలను తొలగించి కొత్త కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తదుపరి ఎండాకాలంలో దృష్టిలో ఉంచుకొని చల్లదనం కోసం ఫ్యాన్లు వినోదం కోసం టీవీలను కూడా అమర్చడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు సమాచారం కొరకు ఏఏ సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేయుటకు బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దాతల సహకారంతో చిన్న పిల్లలు ఉండు ప్రయాణికులు పాలిచ్చుటకు ప్రత్యేకంగా ఒక బేబీ ఫీడింగ్ రూమును కూడా ఏర్పాటు చేయడం (రోటరీ క్లబ్ ద్వారా) జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ఆధునీకరణ పనులతో ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ కు కొత్త శోభ
- Advertisement -
RELATED ARTICLES


