విశాలాంధ్ర – సీతానగరం: ఒక్కసారిగా మండలం మొత్తం జంట హత్యలతో ఉల్లిపడింది. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో వ్యక్తి తన మొదటి భార్య, అత్తను కత్తితో కిరాతకంగా నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో వ్యక్తి తన మొదటి భార్య, అత్తను కత్తితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు చోడదాసి సీతారామరాజు(పండు) తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి (50)పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహమైన ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నప్పటికీ ఒకే వీధిలో వేరు వేరు నివాసాల్లో నివసిస్తున్నారు. కాగా సీతారామరాజు ప్రస్తుతం మరో మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఘటనపై సిఐ ఎస్ వి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ రామ్ కుమార్ క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జంట హత్యలతో ఉలిక్కిపడ్డ బొబ్బిలంక
- Advertisement -
RELATED ARTICLES


