Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంగరంగ వైభవంగా మన్మధోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా మన్మధోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాలే వీధిలో మన్మధోత్సవ వేడుకలు మార్చి 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు గిర్రాజు పద్మనాభం, ఉపాధ్యక్షులు జాగంటి కృష్ణమూర్తి, మల్లక రాఘవ, గిర్రాజు నాగరాజు, కార్యదర్శులు డి.ఎస్ ఆనంద్, దడే కుళ్లాయప్ప, నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 94 సంవత్సరాలుగా ఈ వేడుకలను జరుపుతున్నామని తెలిపారు. రెండవ రోజు మన్మధ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో చేసిన అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. మన్మధ ఉత్సవ విగ్రహాలకు అలంకరణను చీరసాగరం హరి ,మల్లక పాపన్న నిర్వహించారని, విగ్రహాలకు వస్త్ర దాతలుగా మహారాణి టెక్స్టైల్స్ అంజుమన్ సెంటర్ ధర్మవరం వారు వహించారని తెలిపారు. కమిటీ అనుమతితోనే వేషములు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రుద్ర బాలకృష్ణ జుజారు శేషు, కోటం దేవానంద్ ,బాలారెడ్డి, చంద్ర తోపాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు