Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి4న ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరం

4న ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరం

- Advertisement -

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం;;! పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి ఆవరణంలో ఈ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి జి సి నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, సూర్య ప్రకాష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం జిల్లా అంధత్వ నివారణ సంస్థ, పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప, శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ధర్మవరం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కంటి ఆపరేషన్లు పరీక్షలు పూర్తిగా ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమం కింద నిర్వహిస్తామని తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ఉచిత వశతి, ఉచిత ఆపరేషన్, ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. కంటి పరీక్షలకు ఆపరేషన్ల శిబిరమునకు వచ్చేవారు ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాలని తెలిపారు. శిబిరంలో చిన్న పిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు