Homeతెలంగాణతెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు

- Advertisement -

తెలంగాణలో మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్ర విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.ఆ సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ 18,139 మెగావాట్లుగా నమోదైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.ఇది గతంలో నమోదైన గరిష్ఠ డిమాండ్‌ను మించి కొత్త రికార్డుగా నిలిచిందని ఆయన వెల్లడించారు.గత ఏడాది మార్చి 20న రాష్ట్రంలో 17,162మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది.తాజాగా నమోదైన డిమాండ్‌ ఆ స్థాయిని అధిగమించడం రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక పరంగా తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ, విద్యుత్‌ వినియోగంలో మాత్రం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి పెద్ద రాష్ట్రాల గరిష్ఠ డిమాండ్‌కు సమీపంగా ఉండటం గమనించదగ్గ విషయమని భట్టి తెలిపారు.

వేసవి కాలంలో విద్యుత్‌ సరఫరా కొనసాగేందుకు సమగ్ర ప్రణాళికలు
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, వ్యవసాయం, పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతున్నందునే విద్యుత్‌ వినియోగం పెరుగుతోందని ఆయన వివరించారు.ఈ గణాంకాలు రాష్ట్ర అభివృద్ధి దిశను ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు.రాబోయే వేసవి కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగేందుకు ప్రభుత్వం ముందుగానే సమగ్ర ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉందని భట్టి తెలిపారు.కంట్రోల్‌ రూమ్‌ నుంచి క్షేత్రస్థాయి వరకు పనిచేస్తున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన అభినందించారు.వారి కృషి కారణంగా తెలంగాణ విద్యుత్‌ నిర్వహణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు