Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంరైతుల భూములను కాజేయడానికి ఆదాని , కార్పొరేట్ల కుట్ర

రైతుల భూములను కాజేయడానికి ఆదాని , కార్పొరేట్ల కుట్ర

… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : చిన్న, సన్న కారు రైతుల భూములను కాజేయడానికి సోలార్,గాలిమర్ల ఏర్పాటు పేరుతో ఆదాని కార్పొరేట్ దళారులు రైతులకు ఎకరానికి రూ 30 వేలు ఇచ్చి ,20 సం అగ్రిమెంట్ చేసుకుంటామని , రైతులను మభ్యపెడుతున్నారని, ఈ విషయంపై రైతులు జాగ్రత్త వహించాలని , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ కోరారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి సి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ… భూములను కార్పొరేట్ రంగానికి 20 సం లీజు రాసిన తర్వాత వారు ఆ పత్రాలను బ్యాంకులో రుణాలు తీసుకొని సోలార్,గాలిమరలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.అనంత,సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో ప్రైవేట్ కంపెనీ లో దళారులు ప్రవేశించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్, గాలిమర్లకు 50 శాతం రాయితీకూడ ఇస్తోందన్నారు. అనంత జిల్లా లోహార్టికల్చర్ హబ్బును ముందుకు తీసుకుపోవడానికి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి కార్గో విమానాలు ద్వారా పండించిన పండ్లను ఇతర రాష్ట్రాలు తీసుకోపోవడానికి కార్యాచరణ కూడ చేపడుతోందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు అవుతుందని తద్వారా 3860 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. ఈ విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, కావున ఈ దశలో రైతులు భూములు కోల్పోవద్దని కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు వ్యవసాయ భూములు ఇవ్వొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా హంద్రీనీవా రెండో దశ కాంక్రీట్ లైనింగు పనులు చేయడానికి నిధులు మంజూరు చేసిందన్నారు. దీనివలన భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటాయని, కావున తక్షణమే రైతు సంఘాలతో రాజకీయ నాయకులతొ,జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అఖిలపక్షం వేసి చర్చించాలన్నారు. రైతు సంఘాలు నాయకుల సలహాలు తీసుకోవాలని కలెక్టర్కు వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.విద్యుత్ చార్జీలపై వైయస్సార్ పార్టీ ధర్నా చేయడం పట్ల వారికి నైతికత లేదన్నారు. గత వైయస్సార్ ప్రభుత్వంలో నే విద్యుత్ చార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉందని, జగన్ ప్రభుత్వంలోని 20 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారాలను మోపడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. మరలా ఇప్పుడేమో ప్రభుత్వం మారిన తర్వాత దొంగే ,దొంగ అన్నట్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైయస్సార్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . మీరు చేసిన తప్పిదాలకు వైయస్సార్ పార్టీ
బే షరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మరోవైపు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి లో రా కముందు హామీ ఇచ్చి , అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే విద్యుత్ ఛార్జీలు పెంచడం సరైనది కాదన్నారు. కావున తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి .ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సిపిఐ పార్టీ విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… కార్పొరేట్ వ్యవసాయం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోందన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి 2021 డిసెంబర్ 9వ తేదీన ఉభయ సభలో రద్దుచేసి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన చట్టాన్ని తీసుకొని వచ్చి అదే చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. జాతీయ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని దలేవాల్ నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది అన్నారు. తక్షణమే జాతీయ వ్యవసాయ చట్టాలను రద్దుచేసి కిసాన్ సంయుక్త మూర్చతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున మాట్లాడుతూ… భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి సారవంతమైన భూములు అనంత జిల్లాలో ఉందన్నారు. ఇక్కడ దాదాపు 28 రకాల పండ్లు పండించుకునే విధంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ భూములను అంతా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడానికి నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందన్నారు. ఈక్రాప్ నమోదు చేయడం ద్వారా ఏ రైతు తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎక్కడైతే పంట నష్టం వస్తుందో అక్కడ కార్పొరేటర్ రంగానికి అప్పగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. దీని ద్వారా ఆహార ఉత్పత్తులు తగ్గుతాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పంటల బీమా, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాలపై సిపిఐ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు . రైతు సదస్సు కార్యక్రమంలో భాగంగా అధికారులు అక్కడ ఉన్న పంట పొలాలను పరిశీలించి నష్టం జరిగిన చోట అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెట్టిన పంట పండక నష్టం రావడంతో అనంత జిల్లాలోని సింహాద్రిపురం కు చెందిన ఒకే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. రైతుల సమస్య తీరేంతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి.నారాయణస్వామి, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు