Homeజిల్లాలుశ్రీ సత్యసాయికస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

- Advertisement -

ఎంఈఓ రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో చేరుటకు 40 సీట్లు మాత్రమే కలవు అని తెలిపారు. ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండు కుటుంబం వారు వార్షిక ఆదాయము 1,20,000 లోపు ఉండాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉండు కుటుంబంలో వారు 1, 44,000 రూపాయలు లోపు ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం ఓసికి 15 సీట్లు, ఎస్సీకి 5 సీట్లు, బీసీకి 10 సీట్లు ఉంటాయన్నారు. ప్రవేశములో బడిబయట ఉన్న బాలికలకు, అనాధలకు, దివ్యాంగులకు ప్రవేశ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉచిత నివాసంతో కూడిన నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు