Homeఅంతర్జాతీయంవెనిజులా నుంచి అమెరికాకు బంగారం

వెనిజులా నుంచి అమెరికాకు బంగారం

- Advertisement -

కారకస్: వెనిజులా నుంచి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం వచ్చింది. ఇది మన కరెన్సీలో సుమారు రూ.923 కోట్లు. వెనిజులా వద్ద 500 బిలియన్ డాలర్ల బంగారు వనరులు ఉన్నాయని అమెరికా హోం మంత్రి డగ్ బర్గమ్ వెల్లడించారు. శుక్రవారం ఈ బంగారం వచ్చిందని, ఆ దేశం వద్ద పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయని తెలిపారు. వెనిజులా ప్రభుత్వ అధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వెన్‌తో లావాదేవీలకు అనుమతిస్తూ అమెరికా ఇప్పటికే లైసెన్స్ జారీ చేసింది. ఆ సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టింది. ఇటీవల వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌తో బర్గమ్ భేటీ అయ్యారు. అలాగే అమెరికా మైనింగ్, మినరల్ కంపెనీలతోనూ చర్చలు జరిపారు. తాజా లైసెన్స్ కింద ఉత్తరకొరియా, రష్యా, ఇరాన్, క్యూబాకు చెందిన వ్యక్తులు, సంస్థలతో మినర్వెన్ ఒప్పందాలు చేసుకోవడంపై నిషేధం ఉంది. ఖనిజ సంపన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలకు భద్రత కల్పిస్తామని డెల్సీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బర్గమ్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు