Homeజిల్లాలుకర్నూలుమృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు