Homeఅంతర్జాతీయంహొర్మూజ్ వద్ద అమెరికా భీకర దాడులు

హొర్మూజ్ వద్ద అమెరికా భీకర దాడులు

- Advertisement -


వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరడం లేదు. చమురు రవాణాకు ఆధార మార్గమైన హొర్మూజ్ జల సంధి వద్దకు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అభ్యర్ధలనను తన మిత్ర దేశాలు నిరాకరించాయి. హొర్మూజ్ జలసంధిని ఆక్రమించిన ఇరాన్‌ను అడ్డుకునేందుకు అమెరికా తాజాగా భీకర దాడులకు దిగింది. ఈ జలసంధి సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరంపై అత్యంత శక్తిమంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.“హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాల్లో ఉన్న యాంటీ-షిప్ క్రూజ్ క్షిపణులు… అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారాయి. అందుకే ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. లోతుగా చొచ్చుకుపోయే 5వేల పౌండ్ల (దాదాపు 2200 కిలోలకు పైన) శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులతో విజయవంతంగా దాడులు చేశాం” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స’ ఖాతాలో వెల్లడించింది. ఇరాన్ తీర రక్షణ నెట్‌వర్క్‌లో భాగమైన ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. హొర్మూజ్‌లో చమురు రవాణా నిరంతరాయంగా కొనసాగాలంటే ఈ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. తద్వారా ఈ జలసంధి మార్గంలో వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డుకుంటామని తాజా చర్యతో అమెరికా సంకేతాలిచ్చినట్లయ్యింది. సాధారణంగా బంకర్ బస్టర్ బాంబులను భూగర్భంలో ఉండే లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. ఈ బాంబును తయారుచేసేందుకు ఒక్కోదానికి 2.88లక్షల డాలర్లు (రూ.2.6కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు