Homeజిల్లాలుతూర్పు గోదావరిఅగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ

- Advertisement -

కడియం : కడియం అరుంధతి పేటలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి. బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు, సంస్థ సభ్యులతో కలిసి బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, బియ్యం, నగదు అందజేశారు. కోసూరి సూరిబాబు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గిరజాల బాబు మాట్లాడుతూ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు సహాయం అందించాలని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కుసునూరి బాబులు, పలివెల పొతురాజు, ఖండవల్లి జాన్, పల్లపాటి చంద్రకూమర్, కుడేలి సుబ్రహ్మణ్యం, కుడేలి చంద్రరావు, బత్తిన శ్రీధర్, పల్లివెల విజయ్ కూమర్, కొమ్ము సత్తియ్య, కోమ్మరి లక్ష్మి, కుడేలి నాగమణి, వనుం పుత్రయ్య, గుత్తుల అబ్బులు, కత్తుల గంగాధర్, నాని, సాకా సతీష్, సాదే ప్రేమ్ కుమార్, పూడి వీర బ్రహ్మం, చిలుకూరు రామకృష్ణ, వంగపండు ప్రసాదు, రావిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు