విశాలాంధ్ర ధర్మవరం; గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఆర్డిటికు ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ చేయకుండా కాలయాపన చేయడంతో, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణకు కోసం ఎన్నో పోరాట కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పోరాట ఫలితమే నేడు కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికు ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మంచు ఫెర్రర్, ఉమా ను స్వయంగా కలిసి తమ వంతుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్డిటి సేవలు మరింత ఉధృతం కావాలని, భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆర్డిటికీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. తదుపరి ఆర్డిటి పునరుద్ధరి కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటాలు చేసిన అన్ని కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు పేరుపేరునా పాదాభివందనం తెలియజేశారు. ఇది ప్రజలందరి విజయము అని వారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప అని తెలిపారు.
ఆర్ డి టి.. ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్ శుభాకాంక్షలు
- Advertisement -
RELATED ARTICLES


