కరస్పాండెంట్ బీరే వంశీకృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్ పట్టణ బ్రాంచ్ వంశీకృష్ణ నోబుల్ స్కూల్లో ఘనంగా రెండవ వార్షికోత్సవ వేడుకలు పట్టణములోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మీరే వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ ప్రభుత్వ దంత వైద్యులు డాక్టర్ వివేక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వీరే గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని, అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. చదువుతోపాటు వివిధ పోటీలలోనూ, క్రీడారంగములోనూ రాణించాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతో పాటు వారి చదువుల పట్ల కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. చదువు అనేది దొంగతనం చేయని వస్తువు లాంటిదని తెలిపారు. చదువుకు వయస్సు నిమిత్తం లేదని, పేదరికంతో జీవించేవారు కూడా చక్కటి చదువును అనుభవించిన దాఖలాలు కలవని తెలిపారు. గురు శిష్యుల అనుబంధంతోనే మంచి మార్గంతో కూడిన చదువు లభిస్తుందని తెలిపారు. చదువులో బాగా రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో సాధించాలన్న తపన ఉండాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శిరీష, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా వంశీకృష్ణ నోబుల్ స్కూల్ బ్రాంచ్ రెండవ వార్షికోత్సవ వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


