Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

- Advertisement -

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ధర్మవరం పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నందు పిలుపునిచ్చారు. పిఆర్సి కమీషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలి అని,29 శాతముఐ.ఆర్. వెంటనే ప్రకటించాలి అని,పెండింగ్ డి.ఏలు విడుదల చేయాలి అని తెలిపారు.ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు రూట్ మ్యాప్ ప్రకటించాలి అని,సిపిఎస్ రద్దు చేయాలి అని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలి అని,
హెల్త్ కార్డుల, మెడికల్ బిల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని, కోవిడ్ సమయంలో మరణించిన 953 పంచాయతీ రాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు, వెంకట కిషోర్, సకల చంద్ర శేఖర్ ,కృష్ణ తేజ, పెద్దకోట్ల సురేష్, ప్రదీప్, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు