Homeఆంధ్రప్రదేశ్ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి

ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ఆంధ్ర ప్రజలందరూ గర్వంగా భావిస్తున్నారన్నారు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది కీలక మలుపు అవుతుందని తెలిపారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పక్షాలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం కీలకమని పేర్కొంటూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ీVAంమంత్రి అమిత్‌షాలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో అమరావతి ప్రజా రాజధానిగా, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా అవతరించనుందనే విశ్వాసం వ్యక్తమైందన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నవారిపై ప్రజలు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు