Homeజిల్లాలుఅనంతపురంక్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు

క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు

- Advertisement -


ఎంపీడీవో బి. విజయలక్ష్మి

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిరంతరం గ్రామాల్లో పర్యటించినప్పుడే క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన, పట్టు వస్తుందని రాప్తాడు ఎంపీడీవో బి. విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, ప్రత్యేక అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే అసలైన సమస్యలు వెలుగులోకి వస్తాయని, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు. సమస్యల పరిష్కారంలో ప్రత్యేక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు.
​గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతి పైసా లెక్క, అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రభుత్వ ఆస్తుల రిజిస్టర్లు అత్యంత పారదర్శకంగా, పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఫిజికల్ రికార్డులతో పాటు ఆన్‌లైన్ పోర్టల్స్‌లో కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి అందేలా చూడటమే అధికారుల ప్రధాన లక్ష్యం కావాలని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్చుతానంద బాబు, ఏఓ భానురేఖ, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ వరలక్ష్మి, ఏఓ క్రిష్ణచైతన్య, ఎంఈఓ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు