Homeసినిమాఅట్లీ-బన్నీ సినిమా పేరు ‘రాకా’

అట్లీ-బన్నీ సినిమా పేరు ‘రాకా’

- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టు టైటిల్ రాకాగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో అల్లు అర్జున్ సరికొత్త, వైల్డ్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన తీవ్రమైన చూపు, భిన్నమైన గెటప్ సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం గురించిన వార్తలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కావడంతో అధికారికంగా ప్రాజెక్టుకు బీజం పడింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌లో ఈ పోస్టర్ విడుదల కావడం అభిమానులకు మరింత ఆనందాన్ని పంచుతోంది. రాకా టైటిల్ ప్రకటన, పోస్టర్ విడుదల అయిన క్షణాల నుంచే సోషల్ మీడియాలో భారీ ఎత్తున అభిమానుల స్పందన మొదలైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు