Homeసినిమామే 21న దృశ్యం`3

మే 21న దృశ్యం`3

- Advertisement -

హైదరాబాద్: మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో 360కి పైగా సినిమాలు చేశారు. తెలుగులో ఆయన జనతా గ్యారేజ్, మనమంతా, గాండీవం (అతిథి పాత్ర) చిత్రాల్లో నటించారు. రానురాను తన క్రేజ్‌ను పెంచుకుంటూ వస్తోన్న ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం ‘దృశ్యం 3’ మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ రచన, దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ పంచే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనా, ఎస్తేర్ అనీల్, అన్సీబా హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రతి రహస్యానికి బయటపడే సమయం ఒకటుం టుంది’ అంటూ ఇటీవలే విడుదలైన పోస్టర్లు సినీ ప్రియుల్ని ఆకటు ్టకున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి మోహన్ లాల్ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న మరో కొత్త పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా ఆవిష్కరించింది. ‘జార్జ్‌కుట్టి మే 21న ప్రపంచవ్యాప్తంగా రానున్నాడు’ అనే క్యాప్షన్‌ని జోడించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు