యోగ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలిలో ఉచిత వేసవి యోగా శిక్షణా తరగతుల కరపత్రాలను యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, యోగా సభ్యులు, సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్న కుమార్, కట్టా రవికుమార్, సాకే ఈశ్వరయ్య, కోనాపురం సాయి ప్రసాద్, గుర్రం వేణుగోపాల్, దాసరి శ్రీనివాసులు తదితరులు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం పట్టణం నందు 14సంరాలు లోపు విద్యార్థులకు యోగ ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వారి ఆరోగ్యం మంచి ప్రవర్తనతో కూడిన నడవడిక మొదలగు అంశాలు నందు నేర్పించి సిర్టిఫికెట్ ఇవ్వబడును అని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు మే ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు ఉదయం 6.00గంటల నుండీ 7.30 నిముషాల వరకు… సాయంత్రం 5.00గంటల నుండీ 6.30నిముషాల వరకు సాంస్కృతిక మండలి, యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్, శివానగర్ మునిసిపల్ స్కూల్ నందు నిర్వహించబడును అని తెలిపారు. కనుక ఆసక్తి అభిరుచి కల్గిన విద్యార్థులు ముందుగా వారి పేరునమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చరవాణి నెంబర్స్ :9866939075,9885294470 లను సంప్రదించాలన్నారు.
ఉచిత వేసవి యోగా శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల..
- Advertisement -
RELATED ARTICLES


