Homeజిల్లాలుఅనంతపురంవిద్యాసంస్థల్లో భద్రత, మౌలిక వసతులు మెరుగుపరచాలి

విద్యాసంస్థల్లో భద్రత, మౌలిక వసతులు మెరుగుపరచాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్‌కు వైసీపీ విద్యార్థి విభాగం వినతి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విడపనకల్లు మోడల్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థినులపై బ్లేడ్‌తో దాడి జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉరవకొండకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనందును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లోనే విద్యార్థులకు భద్రత లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్, ఉపాధ్యాయుల కొరత, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్లు, ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమస్యలను గుర్తించి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత కోసం అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంజునాథ్ రెడ్డి కోరారు. విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు శివగౌడ్, విద్యార్థి విభాగం నాయకులు అనిల్, పాల్తూరు జయకృష్ణ, తేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు