Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతిభ కనపరిచిన కరాటే విద్యార్థులను అభినందించిన వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

ప్రతిభ కనపరిచిన కరాటే విద్యార్థులను అభినందించిన వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవసాయి పాఠశాలలో ప్రతిభ కనపరిచిన కరాటే విద్యార్థులను వన్ టౌన్ సిఐ రెడ్డప్ప అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమాజంలో జరుగుతున్న వాటి గూర్చి విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. అనంతరం తమిళనాడులో జరిగిన కరాటే టోర్నమెంట్లో ట్రోఫీలు సాధించిన అండర్ 13 లో మొదటి స్థానం శ్రీ చందన-ఏడవ తరగతి, రెండవ స్థానం కె మోక్షిత 9వ తరగతి, అండర్ 9 లో మొదటి స్థానం బి హేమంత్ కు సిఐ రెడ్డప్ప చేతుల మీదుగా టోపీలను విద్యార్థులకు అందజేశారు. తదుపరి సిఐ రెడ్డప్పను ప్రణవసాయి స్కూల్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ కృష్ణ కిషోర్, హెడ్మాస్టర్ ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులు రమేష్, తదితరులు ఘనంగా సన్మానించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు