Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ని దగా డీఎస్సీగా మార్చింది

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ని దగా డీఎస్సీగా మార్చింది

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో నిర్వహించిన మెగా డీఎస్సీ ని దగా డిఎస్సీగా మార్చింది అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు బాగాన రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అంతులేని అవినీతి అక్రమాలతో మెగా డీఎస్సీ జరగడం జరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడటం కూటమి ప్రభుత్వమునకు అలవాటైందని తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్ఆర్సిపి యువజన విభాగం, వివిధ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను తప్పుదోవ పట్టించిందని వారు దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం డీఎస్సీని అమ్ముకొని కోట్లాది రూపాయలను దండుకున్నదని వారు ఆరోపించారు. జీవో నెంబర్ 4 అండ్ 47 లను కొత్తగా తెచ్చి స్పోర్ట్స్ కొట్టాను రెండు శాతం నుండి మూడు శాతానికి పెంచి స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలను పెట్టి గందరగోళంగా సర్టిఫికెట్లను మంజూరు చేసిందని మండిపడ్డారు. అనహృవులకే ఉద్యోగాలను కట్టబెట్టడం జరిగిందని, ఇందుకు సాక్షదారులతో కూడా తాను చూపడం జరిగిందని తెలిపారు. కట్టుదిట్టమైన భారీ భద్రత నడుమ డీఎస్సీ ప్రశ్నాపత్రం డేటాను అవుట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా కోర్టుకు వెళ్ళినప్పటికీ ప్రభుత్వము అనుసరిస్తున్న నిర్లక్ష్యం అవినీతి అక్రమాలకు నిదర్శనమైందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి తీరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం గంగాధర్ నాయుడు తో పాటు రేగటిపల్లి అశోక్ రెడ్డి మదన్మోహన్, రామ్మోహన్ రెడ్డి, ప్రవీణ్, అశోక్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు