Homeజిల్లాలుఅనంతపురంఅప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం

అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం

- Advertisement -

​ విశాలాంధ్ర-రాప్తాడు : పెట్టుబడి కోసం చేసిన అప్పులు భారమవ్వడం, సాగు చేసిన పంటలు ఆశించిన దిగుబడిని ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాప్తాడు మండలం చాపట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు, కనేకల్లు ప్రాంతం నుంచి ఈ గ్రామానికి ఇల్లరికం వచ్చి స్థిరపడ్డాడు. ​కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న నరసింహులు, ఈ ఏడాది టమోటా మరియు వేరుశనగ పంటలను సాగు చేశాడు. అయితే, ఆశించిన మేర ఆదాయం రాకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్దే ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స వంతు మరణించాడు. ​మృతుడికి భార్య, ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేసి కూలీ పనులకు వెళ్తున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ నిరుపేద కుటుంబం, ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులు సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు