Homeఆంధ్రప్రదేశ్స్మార్ట్ సిటీగా కర్నూలురూ 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ పనులు : మంత్రి టీజీ...

స్మార్ట్ సిటీగా కర్నూలురూ 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ పనులు : మంత్రి టీజీ భరత్ గుప్తా

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కర్నూలు ను స్మార్ట్ సిటీగా మార్చడానికి నిరంతర కృషి చేస్తున్నామని రైతు బజార్ విస్తరణ భూమి పూజ సందర్భంగా పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త పేర్కొన్నారు. సోమవారం ఉదయం కర్నూలు పట్టణ సి – క్యాంపు రైతు బజార్ వెనుక పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త , కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తో కలిసి రైతు బజార్ విస్తరణ కొరకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కర్నూలు ను స్మార్ట్ సిటీగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నామని , అందులో భాగంగా సి – క్యాంపులో ఇప్పుడు ఉన్న రైతు బజార్ ను 150 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆరు కోట్ల రూపాయలతో విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టామని తెలిపారు. ఇందులో రైతులకు అవసరమైన నీరు స్ప్రింక్లింగ్ సిస్టం , డ్రిప్ సిస్టం , పార్కింగ్ సౌకర్యం మరియు రెండు ఫ్లోర్ లతో రైతు బజార్ నిర్మాణం చేయడం జరుగుతుందని , ఈ నిర్మాణ పనులు 9 నెలల లోపు పూర్తి అయ్యేలాగా కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రైతు బజార్ ను సందర్శించారని తెలిపారు. 1999 లో తను ఏర్పాటు చేసిన , తనకి ఇష్టమైన రైతు బజార్ ను సందర్శించిన సందర్భంగా రైతులతో మాట్లాడిన తరువాత దీని విస్తరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆ హామీ ఇప్పుడు నెరవేర్చడం జరుగుతుంది మంత్రి తెలిపారు. రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ , పేద ప్రజలకు అత్యంత అవసరమైన మరియు కేవలం 15 రూపాయలకే మూడు పూటల కడుపునిండా భోజనం పెట్టె అన్న క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే కర్నూలు బి – క్యాంపులో హైకోర్టు బెంచ్ మరియు అదునాతనమైన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించే చర్యలు కూడా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను తెలిపారు.ఈ కార్యాక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ,కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , మార్కెట్ యార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ మూర్తి , కర్నూలు మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి , మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ అజమత్ బీ , వైస్ చైర్మన్ శేషగిరి , ఇంజనీర్ రఘురామ రెడ్డి , స్థానిక నాయకులు స్వామి రెడ్డి , గున్నా మార్క్ , రైతు బజార్ ఎస్టేట్ అధికారి మొదలగువారు పాల్గొన్నార

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు