నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్ టి ఏ మరియు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
శెట్టిపి జయ చంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసే పరీక్ష నినీట్. వైద్య విద్యలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ, విద్యలో సమాన అవకాశాలు కల్పిస్తుందని అప్పట్లో ప్రచారం చేశారు అని, కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే, ఈ పరీక్ష విద్యార్థుల ప్రతిభను కొలిచే పారదర్శక వ్యవస్థగా కాకుండా, నిర్లక్ష్యం ఉ అవినీతి ఉ పేపర్ లీకులు ఉ వేదికగా మారిందనే విమర్శలుపెరుగుతున్నాయి అని యుటిఎఫ్ శెట్టిపి జయ చంద్రా రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ ,జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ2026 మే 3న నిర్వహించిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.05 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 551 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అని, ఇంత భారీ స్థాయిలో పరీక్ష నిర్వహించడం చిన్న విషయం కాదు కానీ, ఇంతటి కీలకమైన పరీక్ష నిర్వహణలోనూ పారదర్శకత, భద్రత, సమన్వయం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని తెలిపారు. 2024, 2025 సంవత్సరాల్లో నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు, అక్రమాలు, పరీక్షా కేంద్రాల్లో అవ్యవస్థలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి అని,ఇప్పుడు 2026 పరీక్షపై ఏకంగా రద్దు చేయడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కేవలం ఒక పరీక్షా నిర్వహణ వైఫల్యం కాదు,ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అని,కోట్లాది కుటుంబాల ఆశలపై దెబ్బ. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదకర పరిణామం అని తెలిపారు.ప్రతి సంవత్సరం పేపర్ లీక్ ఆరోపణలే ఎందుకు?పరీక్షా వ్యవస్థలో భద్రత అత్యంత కీలకం. కానీ నీట్ విషయంలో ప్రతి సంవత్సరం పేపర్ లీక్ ఆరోపణలు రావడం సాధారణ విషయంగా మారిపోయిందనీ తెలిపారు.
ఇప్పుడు 2026 పరీక్షల నేపథ్యంలోనూ నీట్ పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులకు ఆత్మస్థైర్యం కోల్పోవడం, అలాగే మరల నీటి పరీక్షలు సిద్ధం కావాలంటే విద్యార్థులలో భయాందోళనకు గురి అవుతారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరిగే నీటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఎంపీ పూర్తిగా వైఫల్యం చెందింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పని స్పష్టం చేశారు.ఇది యాదృచ్ఛికం కాదు. పరీక్షా వ్యవస్థలో మూలపూర్వక లోపాలున్నాయని సూచిస్తోంది అని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యత ఎన్ టి ఏ దే నని,ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం సమస్యలు తలెత్తుతున్నా, వాటిని నివారించే దిశగా సరైన చర్యలు కనిపించడం లేదు అని ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎందుకు పేపర్ లీకులు ఆగడం లేదు?ఎందుకు పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బలహీనంగా ఉంది?ఎందుకు బాధ్యులపై వేగవంతమైన శిక్షలు లేవు?ఎందుకు పారదర్శకతపై సందేహాలు కొనసాగుతున్నాయి?ఇవి కేవలం పరిపాలనా లోపాలు కాదు అని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని తెలిపారు. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోధర్మవరం డివిజన్ యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, వెంకట కిషోర్, చంద్రశేఖర్, సురేష్ ,కృష్ణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


