ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
పట్టణ టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణ పరిసర ప్రాంతాలలో వరుసగా మోటార్ సైకిళ్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, వారి వద్ద నుండి ఆరు మోటార్ల సైకిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అనంతపురం పట్టణం ఇటుకలపల్లి కు చెందిన చాకలి మధు, కదిరి పట్టణానికి చెందిన షేక్ ముబారక్ లను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులు పాత మోటార్ సైకిల్ లను, బలహీనమైన లేదా చెడిపోయిన, లాక్ ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని డూప్లికేట్ డమ్మీ కీస్ తయారు చేసుకుని దొంగతనాలను చేసేవారని తెలిపారు. తదుపరి వేరే చోట వాటిని విక్రయించే వారిని తెలిపారు. నీతో నిందితులు జల్సాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించే వారిని తెలిపారు. అదేవిధంగా ధర్మారం కాకుండా పలు కేసులలో కూడా నిందితులుగా ఉన్నారని తెలిపారు. తదుపరి ప్రజలకు ఒక సూచన ఇస్తూ తమ యొక్క వాహనాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, బయట పార్కు చేసినటువంటి ద్విచక్ర వాహనాలను నకలు తాళం ఉపయోగించి దొంగతనం చేస్తున్నారన్న విషయాన్ని అందరూ గమనించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు చైన్ లాక్ సహాయంతో రెండు టైర్స్ లాక్కు కూడా చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ద్విచక్ర వాహనమునకు జిపిఎస్ ట్రాకింగ్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు చట్టపరమైన పత్రాలు లేకుండా ఎటువంటి వాహనాలను కొనుగోలు చేయరాదని తెలిపారు. అలా ఎవరైనా మీ వద్దకు తక్కువ ధరకు పత్రాలు లేకుండా వాహనాలు అమ్మేందుకు వచ్చినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


