పోస్టల్ సూపర్డెంట్ ఎన్ రెడ్డి భాష
విశాలాంధ్ర ధర్మవరం;; జయహో భీమ సంకల్ప 1.0 లో భాగంగా ధర్మవరం సబ్ డివిజన్ కు సంబంధించిన జీడీఎస్ ధర్మవరం హెచ్ ఓ పోస్టల్ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం పోస్టల్ సూపర్డెంట్ ఎన్ రెడ్డి భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ ఎన్.రెడ్డి భాషా , ఐపీవో విమల్ కుమార్ , ఐపీవో రాజేష్ ,హెడ్ పోస్టుమాస్టర్ విజయ్ కుమార్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ మే నెల 20, 21, 22 తేదీలలో నిర్వహించనున్న “జయహో భీమా సంకల్ప 1.0”లో మనం టార్గెట్‌ను ఎలా అధిగమించాలి అనే అంశంపై విపులంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తపాలా ఉద్యోగులకు సీపీఎంజీ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ నుండి అందిన ప్రశంసా పత్రాలను మన సూపరింటెండెంట్ చేతుల మీదుగా అందజేశారు.అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరింత మంది ఉద్యోగులు ఇలాంటి ప్రశంసా పత్రాలు అందుకునేలా కృషి చేయాలని తెలిపారు. టార్గెట్‌ను భారంగా కాకుండా బాధ్యతగా , ఇష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. వారి ప్రేరణాత్మక మాటలతో ప్రతి ఉద్యోగి తమ వంతు బాధ్యతగా లక్ష్యాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బత్తలపల్లి,ముదిగుబ్బ,తాడిమర్రి, మేడాపురం, ధర్మవరం ఆర్ ఎస్, ధర్మవరం హెచ్ ఓ పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జయహో భీమా సంకల్ప 1.0 లో టార్గెట్ ను అధికమించాలి..
- Advertisement -
RELATED ARTICLES


