Homeజిల్లాలుతూర్పు గోదావరిరైతు కందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

రైతు కందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

- Advertisement -

— పదిమంది రైతు కూలీ కుటుంబాలకు 20 లక్షల పంపిణీ

విశాలాంధ్ర – కడియం : ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి, తెలుగు రైతాంగానికి అపారమైన సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ పేరు యుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని సత్తి భాస్కర రెడ్డి (కంద రెడ్డి) అన్నారు. కడియం మండలం, దుళ్ల గ్రామంలో, కంద రెడ్డి ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పాలు, ధాన్యంతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటి ముందు 2004 వ సంవత్సరంలో కాటన్ దొర విగ్రహాన్ని నిర్మించానని, అప్పటినుండి ప్రతి సంవత్సరం కాటన్ దొర జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాటన్ దొర జయంతి సందర్భంగా, గత 36 సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్న 10 వ్యవసాయ కూలీ కుటుంబాలకు, కుటుంబానికి రెండు లక్షలు చొప్పున, మొత్తం 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా సుమారు రెండు కోట్ల రూపాయలు సామాజిక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేశారని వెల్లడించారు. ఒక సామాన్య కౌలురైతు, అసామాన్య సేవలను అందించారని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు