Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజువిఎస్ఎస్ చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేష్..

విఎస్ఎస్ చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేష్..

- Advertisement -

విశాలాంధ్ర-డుంబ్రిగుడ : డుంబ్రిగుడ వన సంరక్షణ సమితి చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేశ్వర రావు, వైస్ చైర్మన్ గా ఎం. మినీ ని డుంబ్రిగూడ గ్రామస్తులు శనివారం సామాజిక భవనంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, ఎంపీటీసీ సింహాద్రి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్దంగి, రేణుక, వెంకటరాజు ఆధ్వర్యంలో ఏకీభవంగా కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వి ఎస్ ఎస్ చైర్పర్సన్ శెట్టి మల్లేశ్వరరావు మాట్లాడుతూ. వన సంరక్షణ మన అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా వనాన్ని ఉంచాలని చెప్పారు. వన సంరక్షణ కమిటీ చైర్పర్సన్ గా నా శక్తికి మించి ఎటువంటి సమస్య ఉన్న కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు