Homeఅంతర్జాతీయంకొలిక్కి రాని చర్చలు…వీడని సస్పెన్స్!

కొలిక్కి రాని చర్చలు…వీడని సస్పెన్స్!

- Advertisement -

ఒప్పందం కుదిరే వరకు నిర్బంధం కొనసాగుతోంది: ట్రంప్
వాషింగ్టన్:
అమెరికా`ఇరాన్ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు ఉంది. అనిశ్చితి తొలగలేదు. చర్చలు కుదిరే సరికి ఎన్నాళ్లు పడుతుందో చ్పెలేమని నిపుణులు చెపుతున్నారు. ఆదివారం రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేస్తాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. తాజాగా అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్‌తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. ఇక హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం డీల్ ఓ కొలిక్కి వచ్చేవరకు కొనసాగుతోందని వెల్లడించారు.
తొలగని సస్పెన్స్…
వాస్తవానికి ఇరాన్-అమెరికా ఒక ఒప్పందం సస్పెన్స్ వీడలేదు. చర్చల్లో పురోగతి కనిపించడంలేదు. ఎప్ప్పుడు కుదురుతాయో చెప్పలేని సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉండగా… పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధం నాటి నుంచి సుమారు 2 వేల నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి. తక్షణమే హోర్మూజ్‌ను తెరిచినా…పలు కారణాలతో షిప్పింగ్ సాధారణ స్థాయికి రావడానికి చాలా సమయం పడుతుందన్న అంచనాలున్నాయి. నౌకాయాన సంస్థలు సదరు ఒప్పందం స్థిరంగా ఉంటుందని తొలుత నమ్మాల్సి ఉంటుంది.
మరోపక్క… జలసంధిలో అమర్చిన సీమైన్స్‌ను తొలగించడానికి ఎంతకాలం పడుతుందనేది కూడా తెలియాల్సిఉంది. అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు మైన్ స్వీపింగ్ నౌకలను ఈ ప్రాంతంలో మోహరించేందుకే చాలా సమయం పట్టొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. చమురు ఎగుమతి ఆపరేషన్లు స్థిరపడటానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చుని ఆయా వర్గాలు అంచనా.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు