బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లే. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆయన…జూన్ మూడున సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డీకేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే బుధవారం శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కొత్త మంత్రి వర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ…సిద్ధరామయ్య ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్Y శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ రోజు (శనివారం) జరిగే సీఎల్పీ సమావేశంలో డీకేను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మినహా కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, రాజీనామా అనంతరం దిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య…కొత్త క్యాబినెట్లో తన తరఫున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖడ్గే దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు కీలక శాఖలతో పాటు ఉపముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రుల్లో దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చని తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగానే అంటాననే అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేనట్లు తెలిసింది.
జూన్ 3న డీకే ప్రమాణస్వీకారం..?
- Advertisement -
RELATED ARTICLES


