విశాలాంధ్ర _అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానo గ్రామానికి చెందిన బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటికి మొత్తం నలుగురు ముద్దాయిలు అరెస్టు కావడానికి ఎస్పీ తుహిన్ సిన్హా చొరవే కారణమని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకె మారేష్ అన్నారు. శనివారం వుడ్ పేటలో జరిగిన సంఘ సమావేశంలో మారేష్ మాట్లాడుతూ. అత్యంత వెనుకబడిన యాత కులంనకు చెందిన బాలుడు పై కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వారు దాడి చేసి వేధించడం వలన ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మారిష్ చెప్పారు. ఈ విషయంలో మొదటి నుండి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన పరవాడ సిఐ వైఖరి పట్ల జిల్లా యాత సంక్షేమ సంఘం అభ్యంతరం తెలియజేస్తూనే ఉందని, పరవాడ సిఐ వైఖరి పట్ల జిల్లాలో యాత సామాజిక వర్గం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడంతో జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ స్పందించి కేసును పరవాడ సిఐ నుండి సబ్బవరం సీఐ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వలన కేసులో పూర్వభివృద్ధి సాధించిందని మారేష్ చెప్పారు. సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్తిస్థాయిలో కేసును పరిశీలించి అదనపు సాక్ష్యాలు సేకరించి మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారని మారిష్ వివరించారు. పేద వర్గాలకు అండగా నిలిచిన ఎస్పీ కి సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యార్థి రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలపాలని మారేష్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కేసు విచారణలో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో జూన్ 1వ తేదీ నుండి మరల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని అనకాపల్లి లో ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామని, కానీ పోలీసు అధికారులు విచారణ మరింత లోతుగా చేస్తున్నందున జూన్ 1వ తేదీ నుండి తలపెట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో జిల్లా యాత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జుట్టుక రాము, ఎర్ర రాము తదితరులు మాట్లాడారు.
ఎస్పీ ఆదేశాలతోనే బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసు పురోగతి
- Advertisement -


