విశాలాంధ్ర నందిగామ:- మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం స్థానిక నెహ్రు నగర్ లో గల ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ కు ఫర్నిచర్ అందజేసిన మద్దాలి శ్రీనివాసచార్యులు,మద్దాలి నారాయణ చార్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అమెరికాలో నివసిస్తున్న మద్దాల శ్రీనివాసచార్యులు, హైదరాబాదులో నివసిస్తున్న మద్దాలి నారాయణాచార్యులు తమ యొక్క ఆర్థిక సహాయం ద్వారా ఆఫీస్ టేబుల్,ఎస్ చైర్,స్కూల్ టీచర్స్ కి 10 కుర్చీలను స్కూల్ ప్రిన్సిపాల్ కు అందజేశారు అలాగే పులిపాటి వెంకటేశ్వరరావు గోడ గడియారాన్ని స్కూలుకు అందజేయడం జరిగినట్లు ప్రిన్సిపల్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘంటా శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు…
ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ బహుకరణ….
- Advertisement -
RELATED ARTICLES


