Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

- Advertisement -

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా పరిశీలించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వ్యక్తి సమస్య తన సమస్యగా భావిస్తానని పేర్కొన్నారు ఎటువంటి సమస్యలతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన వారి పనులు పూర్తి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు