Homeజిల్లాలుకర్నూలుఅమృత్ 2.0 కింద రూ.36.21 కోట్ల తాగునీటి అభివృద్ధి

అమృత్ 2.0 కింద రూ.36.21 కోట్ల తాగునీటి అభివృద్ధి

- Advertisement -

విశాలాంధ్ర – ధర్మవరం;; పట్టణం లోని, రామ్‌నగర్‌లో ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2.0 పథకం క్రింద రూ.36.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిందల్ సంస్థ ప్రతినిధి, మున్సిపల్ కమిషనర్, మరియు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి మంత్రి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రోజులకోసారి లేదా వారానికి ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, దీనికి ప్రధాన కారణాలు పానుపల్లి ఇంటెక్ వద్ద నీటి పంపింగ్ లోపాలు, విద్యుత్ సమస్యలు అని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ధర్మవరం మున్సిపాలిటీని మూడు జోన్లుగా విభజించి, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ప్రాజెక్ట్‌లో భాగంగా పానుపల్లి ఇంటెక్ వెల్ వద్ద నిమిషానికి 17,460 లీటర్ల సామర్థ్యంతో 2 కొత్త పంపులు ఏర్పాటు చేయబడతాయి అని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని మరింత విస్తరించి పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, మురుగునీటి నిర్వహణ, పార్కుల అభివృద్ధి వంటి కీలక సౌకర్యాల కోసం భారీగా నిధులు కేటాయించారని తెలిపారు.ఇప్పుడు అదే ధర్మవరానికి ఎమ్మెల్యేగా మరో రూ.36.21 కోట్ల ప్రాజెక్ట్ తీసుకురావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తాగునీటి సమస్యలో విద్యుత్ సమస్యలు కూడా ప్రధాన కారణం కావడంతో ధర్మవరం పట్టణానికి భవిష్యత్తులో విద్యుత్ లోటు లేకుండా 110 కోట్లతో ప్రత్యేక డి పి ఆర్ రూపొందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. సూర్యనారాయణ, డిటిహెచ్వో నరసింహుడు, జెడబ్ల్యుఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రతినిధి శ్రీనివాసులు,
మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఈ.ఈ. సాయి కృష్ణ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్, పట్టణ అధ్యక్షులు జింక చంద్ర, కేత శ్రీనివాసులు, వాసు, డోలా రాజారెడ్డి, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు