Homeజిల్లాలుకర్నూలుUTF వెల్ఫేర్ పాలసీ బాండ్లు పంపిణీ

UTF వెల్ఫేర్ పాలసీ బాండ్లు పంపిణీ

- Advertisement -

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం::ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెల్ఫేర్ పాలసీ బాండ్లను పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి యూటీఎఫ్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా శెట్టిపి జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ నాయకుల సంక్షేమం, ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని వెల్ఫేర్ పాలసీని , రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు అందజేస్తున్నారు అని తెలిపారు. ఈ పాలసీలో భాగంగా యుటిఎఫ్ నాయకులు ఎవరైనా అనారోగ్య రీత్యా శస్త్ర చికిత్సలు అవసరం అయితే ఈ పాలసీ ద్వారా ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు తక్షణ సహాయం అలాగే ఒకవేళ మరణిస్తే రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు తక్షణ సహాయం నాయకులకు అందజేయడం వెల్ఫేర్ పాలసీ లక్ష్యమని తెలిపారు
ఈ కార్యక్రమంలో ధర్మవరం రూరల్ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకట కిషోర్ , సి కె పల్లె అధ్యక్షులు పెద్దకోట్ల సురేష్ ధర్మవరం అర్బన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పుల్లయ్య , లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు