Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఢిల్లీ వేదికగా తెలుగు తేజం సోమిశెట్టి సరళకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం!

ఢిల్లీ వేదికగా తెలుగు తేజం సోమిశెట్టి సరళకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం!

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపాజిటరీ’ ముగింపు సన్మాన వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పరిశోధనాత్మక చరిత్రకారిణి, జానపద గాయని , జాతీయ బ్రాండ్ అంబాసిడర్ సోమిశెట్టి సరళ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ మహోన్నత కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , చైర్మన్ వినోదకుమార్ ఇందూల్కర్ ఆమెను మెమెంటో, శాలువాతో సత్కరించి, జాతీయ పురస్కారాన్ని అందజేశారు.
అసమాన పరిశోధనకు దక్కిన గౌరవం:
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చరిత్ర పుటల్లో కనుమరుగైన అనామక వీరులను,స్వాతంత్ర్య సంఘటన ల గాథలను వెలికితీసేందుకు దేశవ్యాప్తంగా అపారమైన కృషి చేసిన 28 మంది ఉత్తమ పరిశోధక రచయితలను కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలో ఘనంగా సత్కరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సోమిశెట్టి సరళ దేశవ్యాప్త పోర్టల్‌లో అత్యధిక పరిశోధనాత్మక కథనాలను సమర్పించి, దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఈ అరుదైన గౌరవాన్ని కైవసం చేసుకున్నారు.ఈ పురస్కారంతో పాటు మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణ భారత దేశం తరపున సోమిశెట్టి సరళ , తన అలుపెరుగని పరిశోధన ద్వారా వెలికితీసి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన కథనాల లోని స్వాతంత్ర్య సమరయోధులు పెద్దవడుగూరు, ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి , ఆయన కుటుంబానికి కూడా ఈ కేంద్ర వేదికపై గౌరవసత్కారం లభించింది. ఒక పరిశోధకురాలిగా తాను రాసిన కథనానికి లభించిన ఈ అత్యున్నత గుర్తింపు ఎంతో హర్షదాయకమని మరియు భావోద్వేగాన్ని కలిగించిందని సరళ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పురస్కార స్వీకరణ అనంతరం సరళ మాట్లాడుతూ… “మరుగున పడిన దేశభక్తుల చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే నా తపస్సుకు, క్షేత్రస్థాయి పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ పురస్కారం ఒక మహోన్నత గౌరవం. కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సి సి ఆర్ టి చైర్మన్ వినోద్ కుమార్ ఇందూల్కర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం, నా కథనంలోని వీరుల కుటుంబానికి సత్కారం జరగడం నా జీవితంలో మరువలేని మైలురాయి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సోమిశెట్టి సరళకు పలువురు ప్రముఖులు, మేధావులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు