విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని ధర్మవరం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జూన్ 28వ తేదీ ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు స్థానిక కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో మహాజనసభ సమావేశం నిర్వహించడం జరుగుతుందని అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ ఆర్ కృష్ణా నాయక్, కార్యదర్శి తుమ్మల సుదీర్ నాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28వ తేదీ ఆదివారం నిర్వహించే మహాజన సభ సమావేశం లో ప్రధానంగా 2025 26 సంవత్సరానికి కార్యవర్గ నివేదికతో పాటు, ఆడిటర్ రిపోర్ట్, బ్యాంకు యొక్క లావాదేవీలు తదితర ప్రధాన అంశములపై సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున సభ్యులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
28న మహాజన సభ సమావేశం .. కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్
- Advertisement -
RELATED ARTICLES


