స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి వ్యక్తి షుగర్ పరీక్షలు నిర్వహించుకొని, అందుకు తగిన మందులను ఉపయోగిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని ఉంచుకోవాలని స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా స్పందన హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ముందు ఆవరణంలో ఉచిత షుగర్ పరీక్షల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉదయం 7 నుండి 10 గంటల వరకు 140 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించి, షుగర్ ఉన్న ఎడల ఎటువంటి మందులు వాడాలి? ఎలాంటి వైద్య చికిత్సలు పొందాల్సి ఉంటుంది అన్న విషయం తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందన హాస్పిటల్స్ సిబ్బంది దిల్దార్, చందన, చలపతి, షారిక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వ్యక్తి షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


