భారత టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే పరాజయం ఎదురవడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోవడం తమకు అవమానకరంగా అనిపించలేదని, కానీ తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించాడు. ఐర్లాండ్ జట్టు అంత అద్భుతంగా ఆడుతుందని తాము ఊహించలేదని అయ్యర్ అంగీకరించాడు.ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. ఁవారు మమ్మల్ని అన్ని విభాగాల్లోనూ అధిగమించారు. మైదానం కొలతలపై వారికి అద్భుతమైన అవగాహన ఉంది. కానీ మేం మైదానాన్ని, వికెట్ తీరును విశ్లేషించడంలో, ప్రణాళికలు రచించడంలో వెనుకబడ్డాం. క్రెడిట్ వాళ్లకే దక్కుతుంది. అయితే, ఆ సిరీస్ నుంచి మేం చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఇంగ్లండ్ పర్యటన మాకు ఒక కొత్త అధ్యాయంఁ అని అయ్యర్ వివరించాడు.బెల్‌ఫాస్ట్‌లోని స్టార్‌మాంట్ మైదానం పరిస్థితులకు అలవాటు పడటంలో జట్టు విఫలమైందని అయ్యర్ తెలిపాడు. ఁబెల్‌ఫాస్ట్‌లో చాలా ఏళ్ల తర్వాత ఆడాం. అక్కడి పరిస్థితులకు, వికెట్‌కు అలవాటు పడటంలో మేం కొంచెం వెనుకబడ్డాం. ఆ మైదానం ఒక స్టేడియంలా లేదు. అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా, అసమానంగా ఉంది. మైదానం కొలతలు కూడా చతురస్రాకారంలో వింతగా ఉన్నాయి. కెప్టెన్‌గా ఫీల్డింగ్ సెట్ చేయడం కూడా నాకు సవాలుగా అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్‌లో మేం ఆడిన గ్రౌండ్‌లన్నీ అన్ని వైపులా సమానంగా ఉంటాయిఁ అని పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌లోని పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఇక్కడి మైదానాలు చదునుగా, స్టేడియం వాతావరణంతో ఉంటాయని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ తన వ్యక్తిగత ఫామ్‌పై ఆందోళన లేదని స్పష్టం చేశాడు. ఁనెట్స్‌లో నేను బంతిని అద్భుతంగా టైమ్ చేస్తున్నాను. ఒత్తిడిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. నా నైపుణ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉందిఁ అని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి సిగ్గుచేటు కాదు.. కానీ తీవ్రంగా నిరాశపరిచింది: శ్రేయస్ అయ్యర్
- Advertisement -
RELATED ARTICLES


