చిన్న వైయసులోనే ఆయనపై ఒత్తిడి తీసుకురావద్దు: కపిల్ దేవ్
క్రీడలు: భారత సికస్ర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 15 ఏళ్లకే సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకుని చరిత్ర సృష్టించిన వైభవ్‌కు…ఇంకా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఐర్లాండ్ చేతిలో సీనియర్ ప్లేయర్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో…అతడికి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చర్చంతా వైభవ్ అరంగేట్రం గురించే! ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ…అతడికి ఇంత హైప్ ఇవ్వొద్దని సూచించాడు.
‘వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అతడి గురించి చాలా ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. వైభవ్‌కు ఇంకాస్త సమయం అవసరం. ఇంత చిన్న వయసులోనే అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దు. ఈ వయసులో అన్నింటినీ అర్థం చేసుకునే అనుభవం ఉండదు. సచిన్, కోహ్లీ స్థాయిలో వైభవ్ కూడా రాణిస్తాడని అనిపిస్తోంది. అయితే అది టీ20 క్రికెట్లో మాత్రమే. వన్డేలు, టెస్టుల్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీ20ల్లో అతడు అసాధారణ ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రభావం చూపే ఆటగాళ్లు చాలా అరుదు. సచిన్ టెండూల్కర్ కూడా చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చాడు. అప్పుడు కూడా తొందర పడ్డామేమో అనుకున్నాం. కానీ చరిత్రను చూస్తే ఆలస్యం చేస్తే తప్ప అయ్యేదని తెలుస్తుంది. వైభవ్ సిద్ధంగా ఉంటే అతని వయసు కాదు…సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నేటి మ్యాచ్‌లో వైభవ్ ఆడతాడా లేదా అని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
వైభవ్ ను అంత పైకి ఎత్తకండి
- Advertisement -
RELATED ARTICLES


